రామాయణాన్ని కళ్ల ముందుంచారు
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:16 AM
మండలంలోని గులుమూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన రామాయ ణం నృత్య రూపకం కళ్లకు కట్టినట్టు ఉందంటూ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మం త్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
విద్యార్థులకు అభినందనలు
సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన మంత్రి లోకేశ్
హిరమండలం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని గులుమూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన రామాయ ణం నృత్య రూపకం కళ్లకు కట్టినట్టు ఉందంటూ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మం త్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా పాఠశాలలో ప్రదర్శించిన ఈ నృత్య రూపకం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో వీక్షించిన మంత్రి లోకేశ్ విద్యా ర్థుల ప్రదర్శనను మెచ్చుకుంటూ శనివారం ఎక్స్‌లో ‘మా ప్రభుత్వ పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకం రామాయణాన్ని నా కళ్ల ముందుంచిందని, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు నటించి లవకుశ సినిమాను గుర్తుకు తెచ్చిందంటూ’ ట్వీట్ చేశారు. ఆరో తరగతి చదువుతున్న వంజరాపు ప్రవశ్య, మూడో తరగతి చదువు తున్న ఓలక నవ్యశ్రీ, ఇనుముల గీతిక, నాలు గో తరగతి చదువుతున్న జర్జాన సుస్మిత, సిగడాన నవ్యశ్రీ, కొరయ్య జోషిత, పొట్నూరు ఇందుశ్రీ, ఐదో త రగతి చదువుతున్న టంకాల బేబీరాణి, ఒక టో తరగతి చదువుతున్న శనపతి శివకు మార్‌లకు ఈ సందర్భంగా మంత్రి తన ఆశీ స్సులు తెలియజేశారు. మన సంస్కృతి, సం ప్రదాయాలను చాటే రామాయణంలో ము ఖ్య ఘట్టాలను ఐదు నిమిషాల్లో ప్రదర్శించ డం గొప్పవిషయమన్నారు. శ్రీరామచరితం పేరుతో ఈ ప్రదర్శనను రూపొందించి పర్యవేక్షించిన పాఠశాల ఉపాధ్యాయిని జిన్నాడ పార్వతిని, ఇందుకు ప్రోత్సహించిన ఎంఈవో-2 సుంకు దాలయ్యకు అభినం దనలుంటూ ట్వీట్ చేశారు.