Share News

వాన రాలే.. పైరు ఎండిపోయె!

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:10 AM

Severe rain-deficit conditions across the srikakulam ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక జిల్లాలో వరినారు, ఎదలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 3.28 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 1.69 లక్షల ఎకరాల్లో నారుపోయగా.. మిగతా భూముల్లో ఎదలు వేశారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా వరినారు, ఎదలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వాన రాలే.. పైరు ఎండిపోయె!
పోలాకి: మొగివిల్లిపేట వద్ద ఎండిపోతున్న వరి ఎద

  • పలాస డివిజన్‌లో లోటు వర్షపాతం

  • జిల్లా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు

  • ఎండిపోతున్న వరి ఎదలు, నారు

  • ఖరీఫ్‌ సాగులో భాగంగా ఇప్పటికే శతశాతం వరి ఎదలు, నాట్లు పూర్తిచేసి రైతులు కలుపుతీత పనుల్లో బిజీగా ఉండాలి. ఎరువులు, పురుగు మందులు చల్లి.. పెరుగుతున్న పంటలను చూస్తూ మురిసిపోతుండాలి. కానీ, ఈ పరిస్థితి పలాస డివిజన్‌లో మచ్చుకైనా కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు జాడలేకపోవడంతో వరి ఎదలు వేసిన రైతుల్లో దిగులు కనిపిస్తోంది. మూడు నెలలుగా సరైన వానలు లేకపోవడంతో మొలకలు వస్తాయా.. రావా? అని వారు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటిని ఇంజన్ల సహాయంతో తోడుతూ.. వరిఎదలు, నారుకు జీవం పోస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

  • పలాస/ నరసన్నపేట/ ఎచ్చెర్ల రూరల్‌/పోలాకి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక జిల్లాలో వరినారు, ఎదలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 3.28 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 1.69 లక్షల ఎకరాల్లో నారుపోయగా.. మిగతా భూముల్లో ఎదలు వేశారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా వరినారు, ఎదలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వంశధార, నారాయణపురం, తోటపల్లి తదితర కాలువల ద్వారా కూడా సక్రమంగా నీరు అందకపోవడంతో వరినారును కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. కొందరు రైతులు కాలువలు, చెరువుల వద్ద ఇంజన్లు పెట్టి పైపుల ద్వారా పంటలకు నీటి తడి అందిస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు పెట్టుబడి పెట్టామని.. వరుణుడు కరుణించకపోతే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు.

  • పలాస డివిజన్‌లో కరవుచాయలు నెలకొన్నాయి. ఇప్పటివరకు 40 శాతం కూడా వరి ఎదలు, ఉబాలు జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ డివిజన్‌లో పలాస, పలాస-కాశీబుగ్గ, మందస, వజ్రపుకొత్తూరు, కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలు ఉన్నాయి. మొత్తం 62 వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టాల్సి ఉంది. మిగిలిన ప్రాంతాల్లో జీడి, కొబ్బరి, వాణిజ్య పంటలు సాగులో ఉన్నాయి. ప్రధాన పంట మాత్రం వరిదే. బాహుదా, మహేంద్రతనయ నదులు, వంశధార కాలువ ద్వారా సగానికిపైగా భూములకు సాగునీరు అందుతుంది. మిగిలిన భూములన్నీ వర్షాధారమే. భారీ వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తే తప్ప.. అన్ని ప్రాంతాలకు నీరు చేరదు. వంశధార కాలువ ద్వారా వారం రోజులు నీరు వచ్చి ఆ తరువాత నిలిచిపోవడంతో ఆ ప్రాంతాల్లో పంటలు ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాలు సైతం మొహం చాటేశాయి. డివిజన్‌ అంతా లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో 143.3 శాతం నమోదు కావాల్సి ఉండగా, 46.3 శాతం మాత్రమే కురిసింది. 67.7 శాతం లోటు ఏర్పడింది. జూలైలో 186.4 శాతానికిగాను 88.6 శాతం మాత్రమే నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకూ 90.2 శాతం నమోదు కావాల్సి ఉండగా, 86.2 శాతమే వర్షం పడింది. మొత్తం మూడు నెలలకుగాను 419.8 శాతం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 221.1 శాతం మాత్రమే వర్షం కురిసింది. ఇప్పటికే రైతుసంఘ నాయకులు పలాస డివిజన్‌కు కరవుగా ప్రకటించి రైతులకు రాయతీలు అందించాలని ఆర్డీవో ఆర్‌.అప్పలరాజకు వినతిపత్రాలు సమర్పించారు.

Updated Date - Aug 19 , 2026 | 12:10 AM