Share News

క్యూఆర్‌ కోడ్‌ విధానం నిలిపివేయాలి

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:56 PM

పీడీఎస్‌ ద్వారా పంపిణీచేస్తున్న సరకులకు సంబంధించి కమీషన్‌ పెంచాలని డీలర్ల సంఘ నాయకులు కోరారు. రేషన్‌ డిపోల్లో బియ్యం పంపిణీకి అమలు చేయనున్న క్యూఆర్‌ కోడ్‌ విధానం నిలిపివేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా డీలర్లు తమ సమస్యల పరిష్కారానికి శుక్రవారం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.

క్యూఆర్‌ కోడ్‌ విధానం నిలిపివేయాలి
టెక్కలి: తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న డీలర్ల సంఘ నాయకులు::

పీడీఎస్‌ ద్వారా పంపిణీచేస్తున్న సరకులకు సంబంధించి కమీషన్‌ పెంచాలని డీలర్ల సంఘ నాయకులు కోరారు. రేషన్‌ డిపోల్లో బియ్యం పంపిణీకి అమలు చేయనున్న క్యూఆర్‌ కోడ్‌ విధానం నిలిపివేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా డీలర్లు తమ సమస్యల పరిష్కారానికి శుక్రవారం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.

ఫటెక్కలి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పీడీఎస్‌ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని టెక్కలి మం డల రేషన్‌ డీలర్ల సంఘం డిమాండ్‌చేసింది. టెక్కలి తహసీల్దార్‌ ఎస్‌.రాంబాబుకు డీలర్ల సంఘ అధ్యక్షుడు కిమిడి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి వసంత్‌కుమార్‌, డీలర్లు నారాయణరావు, విజయలక్ష్మి, చిట్టమ్మ వినతిపత్రం అందజేశారు.

ఫనరసన్నపేట, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): చౌకధరల దుకాణాలకు పంపిణీ చేసే బియ్యం బస్తాలకు క్యూఆర్‌ కోడ్‌ విధానం విరమించాలని డీలర్లు కోరారు.ఈ మేరకు బియ్యం బస్తాలకు తరుగు వస్తుండడంతో నష్టపోతున్నామని, కమీషన్‌ పెంచాలని రేషన్‌ డీలర్ల సంఘ నాయకులు ఉణ్న బాలభాస్కరరావు, లావేటి.మురళి తహసీల్దార్‌ ఆర్‌. సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.

ఫజలుమూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) రేషన్‌ డిపోల్లో బియ్యం పంపిణీకి అమలు చేయనున్న క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం వల్ల డీలర్లపై అదనపు భారంతోపాటు సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశముందని డీలర్లు సంఘం మండలాధ్యక్షులు రేగాన జగదీశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు.ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేసి డీలర్లను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు జలుమూరులో తహసీల్దార్‌ జె.రామారావుకు వినతిపత్రం అందించారు.

Updated Date - Aug 28 , 2026 | 11:56 PM