పైడిగాం చానెల్‌కు మరమ్మతులు చేయాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:49 PM
పైడిగాం చానెల్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలని రైతు సంఘం ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కప్ప గోపీనాధ్, ఢిల్లీరావు, కాయ ప్రకాష్, జైరావు, మన్మఽథరావు డిమాండ్ చేశారు. ఆదివారం బాతుపురం వద్ద పైడిగాం హెడ్ చానెల్‌ను రైతు సంఘం ప్రతి నిధులు పరిశీలించారు.
సోంపేట రూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): పైడిగాం చానెల్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలని రైతు సంఘం ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కప్ప గోపీనాధ్, ఢిల్లీరావు, కాయ ప్రకాష్, జైరావు, మన్మఽథరావు డిమాండ్ చేశారు. ఆదివారం బాతుపురం వద్ద పైడిగాం హెడ్ చానెల్‌ను రైతు సంఘం ప్రతి నిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సంభవిం చిన తుఫాన్ బీభత్సానికి ప్రధానకాలువకు గండ్లు పడడంతోపాటు మదు ములకు తలుపులు పాడయ్యాయని తెలిపారు. సోంపేట, కంచిలి, మందస మండలాల పరిధిలో పలు గ్రామాల్లోని ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా మరమ్మతులు పూర్తిస్థాయిలో చేయాలని కోరారు.