Share News

అటకెక్కుతున్న ‘స్వచ్ఛసంకల్పం’

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:39 PM

జిల్లాలో స్వచ్ఛసంకల్పం లక్ష్యం అటకెక్కుతోంది. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛసంకల్పం పథకంలో భాగంగా నిధులు మంజూరుచేసింది.

 అటకెక్కుతున్న ‘స్వచ్ఛసంకల్పం’
అయోధ్యపురం పంచాయతీ కార్యాలయం వద్ద తుప్పు పడుతున్న చెత్త తరలించే రిక్షాలు :

టెక్కలి రూరల్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్వచ్ఛసంకల్పం లక్ష్యం అటకెక్కుతోంది. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛసంకల్పం పథకంలో భాగంగా నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి పంచాయతీకి రెండేసి చొప్పున చెత్త తరలింపునకు రిక్షాలు కొనుగోలుచేసి అందజేశారు. వీటిని సర్పంచ్‌, కార్యదర్శి నిర్వహించేందుకు వీలుగా రూ.ఆరువేల గౌరవవేత నంతో పంచాయతీకి ఒక స్వచ్ఛభారత్‌ సేవకుని కూడా నియమించారు. ఈ సేవకులు సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రానికి తరలించాలి.వీరికి స్వచ్ఛ భారత్‌, పంచాయతీ జనరల్‌ఫండ్‌ నుంచి వేతనాలు చెల్లించాల్సిఉంటుంది. అయితే స్వచ్ఛసంకల్పం పేరుతో లక్షలాదిరూపాయల ప్రజాధనం వెచ్చించి కొ నుగోలుచేసిన రిక్షాల నిర్వహణలో పంచాయతీ సిబ్బంది శ్రద్ధకనబరచకపోవ డంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచా యతీల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నా పంచాయతీ స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో స్వచ్ఛసంకల్పం వంటి కార్యక్రమాలు విఫలమవుతు న్నాని పలువురు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు. అయితే జిల్లాలో ఎక్కువ పంచా యతీల్లో వైసీపీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా ఉన్నారు. వీరు పంచాయతీల్లో చెత్తతరలింపు రిక్షాలకు సంబంఽధించి వినియోగించకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.చెత్తను సంపదకేంద్రాలకు తర లించేందుకు వినియోగించాల్సిన రిక్షాలను పంచాయతీ కార్యాలయాలు, సర్పం చ్‌ల ఇళ్ల ఆవరణలో రోజుల తరబడి పార్కింగ్‌చేయడంతో పింపిరిపట్టి పాడవు తున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలుచేసిన చెత్త తరలింపు రిక్షాలను వృథాగా విడిచిపెట్టడంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్ష ణమే ఈ రిక్షాలను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:39 PM