చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - May 03 , 2026 | 12:05 AM
అభివృద్ధిని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకునివెళ్లాలని వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, మే 2(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకునివెళ్లాలని వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం ఆయన నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీ క్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పారదర్శకమైన పాలన కొనసాగుతోం దని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడడం లేదని అన్నారు. అంతకుముందు కార్యకర్తల అభిప్రాయాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులపై మంత్రి కూలం కుషంగా చర్చించారు.
గత ఐదేళ్లలో దుర్మార్గమైన పాలన
గత ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా దుర్మార్గమైన అవినీతి పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి, ప్రజల స మస్యలను విస్మరించిన పాలన సాగిందని ఆరోపిం చారు. ప్రభుత్వ వ్వవస్థలు పూర్తిగా నిర్వీర్యమ య్యాయని విమర్శించారు. కార్యక్రమంలో పీఏసీ ఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూళన సంస్థ ఆధ్వర్యంలో 180 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీవోఏ)లకు 5జీ మొబైల్ ఫోన్లును మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. కార్యక్రమంలో వీవోఏ సంఘ చైర్‌పర్సన్ పి.భాను మతి, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాల్యవివాహాల నిర్మూళన, చైల్డ్‌హెల్ప్‌లైన్, టీనేజీ ప్రెగ్నెసి వల్ల జరిగే నష్టాలు, ఆడపిల్లలు ప్రలోబా లకి లోడకుండా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనే సూచనలకు సంబందించిన పోస్టర్లను ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తితో కలిసి ఆవిష్కరించారు.
గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
గోమతాను జాతీయ ప్రాణిగా ప్రకటించాలం టూ జరుగుతున్న గోరక్ష రథయాత్ర శనివారం ని మ్మాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ బృందం స భ్యులు నిమ్మాడలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డుకు కలిశారు. 185 మంది ఎమ్మెల్యేలకు, 25 మంది పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు అందజేస్తున్నా మని ఆ సంస్థ సభ్యులు మట్టిగొయ్య పోతురాజు అ న్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కోరాడ రాంప్రసాద్, మహిళా కార్యదర్శి అల్లు తులసి ఆధ్వర్యంలో జరగిన ఈ కార్యక్రమంలో ధర్మ రక్షిత ఫౌండేషన్ చైర్మన్ వైవీ సత్యనారాయణ, శ్రీశైలం, భువనేశ్వరి పీఠాధిపతి అభినవ కళ్యానంద భారతి, పితాని స త్యనారాయణ తదిత రులు పాల్గొన్నారు.