Share News

అర్జీదారులు పోటెత్తారు

ABN , Publish Date - May 05 , 2026 | 12:08 AM

జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్‌ అర్జీలు స్వీకరించే చోట అధిక రద్దీ కనిపించింది.

 అర్జీదారులు పోటెత్తారు
కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన జనం

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 4(ఆంధ్రజ్యోతి): జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్‌ అర్జీలు స్వీకరించే చోట అధిక రద్దీ కనిపించింది. పోలీసులు వచ్చి అర్జీదారులను క్యూలో నిల్చోబెట్టారు. సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురం గ్రామానికి చెందిన కోరాడ లక్ష్మీప్రసన్న పదిలో 600 మార్కులకు 597 మార్కులు సాధించింది. ఈ బాలికను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ దుశ్శాలువతో సత్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు ఆయుష్‌ సిబ్బంది వైద్య సేవలను అందించారు. కార్యక్రమంలో ఆయుష్‌ వైద్యా ధికారి ఉత్తమ్‌ రాజ్‌, డా.సీతామహాలక్ష్మి, జాడ.చంద్రశేఖర్‌, రోణంకి కృష్ణారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సత్వర పరిష్కారం చూపాలి: కలెక్టర్‌

అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. వివిఽధ సమస్యలపై ఆయన 122 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు సమస్యల పరిష్కా రంలో నాణ్యత పాటించాలన్నారు. కార్యక్రమంలో అసి స్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పూర్తిస్థాయి పింఛను ఇప్పించండి

మల్ల గిరిబాబు అనే దివ్యాంగుడు కూర్చునేందు కు కూడా ఒకరి సాయం ఉండాల్సిందే. పూర్తిస్థాయి దివ్యాంగుడు. ఎంతోమంది అధికారులకు విన్నవించు కున్నానని, కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, పూర్తి పింఛను రూ.15వేలు మంజూరు చేయాలని నంది గాం మండలం శివరా పురం పంచాయతీ భరణిగామ గ్రామానికి చెందిన మల్ల గిరిబాబు (26) కలెక్టర్‌ను వేడుకున్నారు.

‘మత్స్యకార భరోసా’లో అక్రమాలపై ఫిర్యాదు

పాత శ్రీకాకుళం, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మత్స్యకారుల వేట నిషేధ సమయంలో ఇచ్చే ‘మత్స్యకార భరోసా’ పథకంలో అక్రమాలు జరిగాయని, అర్హులకు కాకుండా అనర్హులకు ఈ పథకం వర్తింపజేయడంతో ఎఫ్‌డీవో చేతివాటం ప్రదర్శించారని పెద్దగనగళ్లపేట గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌డీఏ పీడీకి ఆ సంఘ నేత బర్రి రామారావుతో పాటు పలువురు గ్రామస్థులు వినతిపత్రం అందించారు. ఈ పథకం వర్తింపులో బోటు యజమాని అనుమతి లేకుండా పేర్లు మార్చారని, తెప్ప యజమాని ఇచ్చిన పేర్లు కాకుండా ఇతరుల పేర్లు చేర్చి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అర్హులను న్యాయం చేయాలని కోరారు. డీఆర్‌డీఏ పీడీ స్పందిస్తూ.. ఈ పథకం వర్తింపులో జరిగిన అవకతవకలపై పునఃపరిశీలన చేసి అనర్హులను తొలగించి అర్హులకు అందజేయాలని మత్స్యశాఖ ఏడీవో గోపీకృష్ణను ఆదేశించారు.

Updated Date - May 05 , 2026 | 12:08 AM