వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:01 PM
వైసీపీకి చెందిన కొంతమంది నేతలు నోటి దురుసుతో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిసు ్తన్నారని, అలాంటి బూతుల బ్యాచ్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధికార ప్రతినిధి పీఎంజే బాబు అన్నారు.
- పీఎంజే బాబు
శ్రీకాకుళం,ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన కొంతమంది నేతలు నోటి దురుసుతో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిసు ్తన్నారని, అలాంటి బూతుల బ్యాచ్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధికార ప్రతినిధి పీఎంజే బాబు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వైసీపీ నేతలు ఎన్ని కవ్వింపు చర్యలకు దిగినా.. క్రమశిక్షణ గల పార్టీగా టీడీపీ శ్రేణులు సంయమనం పాటిస్తు న్నాయని పేర్కొన్నారు. కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కల్తీ నెయ్యితో తిరుపతి లడ్డూలు తయారు చేసినట్లు ‘సిట్’ ఆధారాలతో సహా నిరూ పించినా.. వైసీపీ నేతలు బుకాయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా నోటి దురుసు తగ్గించుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించా రు. ఈ సమావేశంలో ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం పాల్గొన్నారు.