పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకం
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:11 AM
గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
గ్రామ పాలన ప్రజల చేతుల్లో ఉండాలి.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అరసవల్లి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జాతీయ పంచా యతీరాజ్ దినోత్సవం సందర్భంగా జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలతో మమేకం కావడంతో పాటు వారికి అన్ని సంక్షేమ పథకా లను సకాలంలో అందజేసే శాఖ పంచాయితీరాజ్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ శాఖ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో పాలనను ప్రజల చేతుల్లోకి తీసుకువచ్చి, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో పంచాయతీలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ప్రజలందరూ పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంద న్నారు. అనంతరం విధి నిర్వహణలో విశేషమైన సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమొంటో లను మంత్రి శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, శ్రీకాకుళం, టెక్కలి, పలాస డీడీఓలు, ఎండీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీవోలు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాదర్బార్‌లో ఇన్‌చార్జి మంత్రి
అరసవల్లి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): అత్యవసర సమస్యలపై అధికారులు స్పం దించి, తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధి కారులను ఆదేశించారు. శుక్ర వారం నగరంలోని విశాఖ-ఎ కాలనీ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ క్యాడర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గొండు శంకర్ స్వాగతం పలికారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయా లన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్, నేతలు ప్రధాన విజయరాం, పీఎంజేబాబు, సింతు సుధాకర్, పాండ్రంకి శంకర్, కవ్వాడి సుశీల, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.