వృద్ధుడు అదృశ్యం
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:13 AM
పలాస మండలం చిన్ననీలావతి గ్రామానికి చెందిన పి.గంగయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడు అదృశ్యమైనట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు.
పలాస, జూన్ 17(ఆంధ్రజ్యోతి): పలాస మండలం చిన్ననీలావతి గ్రామానికి చెందిన పి.గంగయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడు అదృశ్యమైనట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. విశాఖపట్నం విమ్స్ కళాశాల వద్ద రెండు రోజుల క్రితం తప్పిపోయాడని, ఆయన మానసిక స్థితి సక్రమంగా లేదని వారి కుటుంబీకులు తెలిపారు. వివరాలు తెలిస్తే ఫోన్ నెంబర్లు: 70639 20359, 89009 84841కు తెలియజేయాలని కోరారు. బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.