బావిలో దూకిన వృద్ధురాలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:07 AM
అందరూ ఉ న్నా ఒంటరితనంతో బాధప డుతున్న ఓ వృద్ధురాలు తన ఇంట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది.
కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
కాశీబుగ్గ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అందరూ ఉ న్నా ఒంటరితనంతో బాధప డుతున్న ఓ వృద్ధురాలు తన ఇంట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే ప్రాణభయంతో కేకలు వేయడంతో స్థానికులు గమ నించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరు కుని ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీబుగ్గ పరిధి చినబాడం గ్రామానికి చెందిన మనిగాం దమయంతి(65) స్థానికంగా నివాసం ఉంటుంది. ఆమె భర్త రైల్వేలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసి.. ఇటీవల మరణించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు అయిపోయారు. పిల్లలు పట్టించుకోకపోవడంతో పాటు భర్తకు సంబంఽధించిన పెన్షన్ కూడా రావడంలేదు. దీంతో బతకడానికి కష్టంగా మారడంతో మనస్తా పానికి గురైన ఆమె గురువారం ఈ అఘాయి త్యానికి పాల్పడింది. కానీ భయంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకుని అతికష్టం మీద కాపాడారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయంగా మారింది.