గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:54 PM
గ్రామాల అభివృ ద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృ ద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం పారశెల్లి గ్రామంలో ఎంపీ ల్యాడ్‌తో చేపట్టిన బస్సు షెల్టర్‌ను ఎమ్మెల్యే ప్రారం భించారు. అలాగే చిల్డ్రన్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న డబ్బీరు కిషోర్ చంద్రపట్నాయిక్‌ను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, సర్పంచ్ డబ్బీరు కిరణ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతిని అందరి ఇళ్లులో భోగభాగ్యలతో ఉండాలని, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బుధవారం ఒక ప్రకటన విడుదల పేర్కొన్నారు.