గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:07 AM
గిరి జన గ్రామాల అభివృద్ధే లక్ష్య మని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలంలో రూ.5కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను శుక్రవారం చేశారు.
హరిపురం, ఫిబ్రవరి 6(ఆం ధ్రజ్యోతి): గిరి జన గ్రామాల అభివృద్ధే లక్ష్య మని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలంలో రూ.5కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స మావేశాలు ఏర్పాటు చేశారు. సొండిపూడిలో ఆరోగ్య మిషన్ నిధులు రూ.29 లక్షలతో నిర్మించిన విలేజ్, హెల్త్ క్లీనిక్, సిద్దిగాం పంచాయతీ శ్రీరాంపురం గ్రా మంలో నాబార్డు నిధులు రూ.30లక్షలతో నిర్మించిన మందస పీఏసీఎస్ గొదాం ను ప్రారంభించారు. పీఎం జన్మన్ నిధులు రూ.3.65కోట్లతో గౌడగురంటి- అం బటి కంబారం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. హొన్నాళి పంచాయతీ కొరడాబ డిలో రూ.లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం ప్రారంభం, జల్ జీవన్ పథ కంలో కొంకడాపుట్టి పంచాయతీలో రూ.38.50లక్షల వ్యయంతో మందస పట్ట ణంలో రూ.73.40లక్షలతో ఇంటింటా కుళాయి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీఈఈ రవి, జేఈఈ ధనుంజయ్, టీడీపీ నాయకులు బావన దుర్యోధన, తమరి భాస్కరరావు, కొర్ల కన్నారావు, బమ్మిడి కర్రయ్య, మిస్కా గణ పతి, ఈశ్వర్రావు, సాలిన మాధవరావు, జానకిరావు, రట్టి లింగరాజు, బైరిశెట్టి గున్నయ్య, గొర్లె హరీష్, మంగళపాత్రో, మండల లచ్చయ్య, రుద్రయ్య, మహేష్, పీఏసీఎస్ అధికారులు పాల్గొన్నారు.