Share News

మాతృభాషను విస్మరించరాదు

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:40 PM

మాతృభాషను విస్మరించరాదని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు.

 మాతృభాషను విస్మరించరాదు
టెక్కలి: తెలుగుతల్లి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు :

మాతృభాషను విస్మరించరాదని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు.

ఎల్‌.ఎన్‌.పేట, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కొవిలాం ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఎం.గజపతిరావుఆధ్వర్యంలో మాతృభాషాదినోత్సవం పురస్కరించుకుని విద్యా ర్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. అలాగే లక్ష్మీనర్సుపేట మోడల్‌ ప్రాఽథమికపాఠశాలలో హెచ్‌ఎం రమాదేవి ఆధ్వర్యంలో లక్ష్మీనర్సుపేట ఉన్నతపాఠశాల తెలుగుఉపాధ్యాయుడు సింహాచలాన్ని సన్మానించారు.

ఫసంతబొమ్మాళి, ఫిబ్రవరి21(ఆంధ్రజ్యోతి):మండలంలోని దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పిట్టగంగన్న ఆధ్వర్యంలో తెలుగుతల్లి చిత్రపటానికి పూల మాల వేసి మాతృభాష ఔన్యతాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, లక్ష్మీనారాయణ, తిరుపతిరావు పాల్గొన్నారు.

ఫ టెక్కలి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, ఒరియావిభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ గోవిందమ్మ మాట్లాడుతూ మాతృభాష గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కోటేశ్వరరావు, జగన్నాదోబిసాయి, వెంకటేశ్వర్లు, ధర్మారావు, రమేష్‌ పాల్గొన్నారు.

ఫపాతపట్నం, ఫిబ్రవరి21(ఆంద్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పూజారి కామేశ్వరరావు ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి శివరామకృష్ణ పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెప్పలకు సన్మానం

పలాసరూరల్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పలాసకు చెందిన జనజాగృతి కళా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తెప్పల కృష్ణమూర్తి విజయవాడలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించి కార్యక్రమంలో మాతృభాషా- ఆవశ్యకతపై కవితాగానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పొట్లూరి హరికృష్ణ, నారంశెట్టి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కృష్ణమూర్తిని సన్మానించారు.

Updated Date - Feb 21 , 2026 | 11:40 PM