‘చిరస్మరణీయుడు ప్రజాకవి గరిమెళ్ల’
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:47 PM
స్వాతం త్ర్యోద్యమ కాలంలో ‘మా కొద్దీ తెల్లదొరతనమూ’ అంటూ తన గళంలో ప్రజ లను ఉత్తేజితులను చేసిన ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ చిరస్మర ణీయుడని పలువురు వక్తలు అన్నారు.
శ్రీకాకుళం లీగల్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): స్వాతం త్ర్యోద్యమ కాలంలో ‘మా కొద్దీ తెల్లదొరతనమూ’ అంటూ తన గళంలో ప్రజ లను ఉత్తేజితులను చేసిన ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ చిరస్మర ణీయుడని పలువురు వక్తలు అన్నారు. స్థానిక శాంతినగర్ కాలనీల్లో గాంధీ స్మారక వనంలో స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ 133వ జయంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మందిరం ప్రతి నిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొంక్యాన వేణుగోపాల్, మురళీ ధర్, వావిలపల్లి జగన్నాథం నాయుడు మాట్లా డుతూ.. జిల్లాకు చెందిన గరిమెళ్ల స్వాతంత్ర్యో ద్యమంలో తన పాట, గాత్రంతో బ్రిటీష్ వారిని గడగడలాడించడమే కాకుండా నాటి ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను పాదుకొల్పారన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి గరిమెళ్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్ర మంలో సంస్థ ప్రతినిధులు నిష్ఠల నరసింహ మూర్తి, ఎంవీవీఎస్ శాస్త్రి, శాస్త్రీ, డాక్టర్ మందుల మోహనరావు, పైడి హరనాఽథరావు, జామి భీమశంకరరావు, చౌదరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.