Share News

ఆశలదీపం ఆరింది

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:27 AM

13 ఏళ్ల క్రితం ఓ బిడ్డను కోల్పోయారు. ఆ బాధ నుంచి కోలుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకే తమ జీవితానికి ఆసరా, వృద్ధాప్యానికి ఆధారం అనుకున్నారు.

ఆశలదీపం ఆరింది
శ్యామ్‌కుమార్‌ (ఫైల్‌)

  • ప్లెక్సీ కడుతూ విద్యుత్‌ వైర్లు తాకి కొడుకు మృతి

  • గతంలో అనారోగ్యంతో కుమార్తె మృత్యువాత

  • శోకసంద్రంలో తల్లిదండ్రులు

13 ఏళ్ల క్రితం ఓ బిడ్డను కోల్పోయారు. ఆ బాధ నుంచి కోలుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకే తమ జీవితానికి ఆసరా, వృద్ధాప్యానికి ఆధారం అనుకున్నారు. బాగా చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని అనుకున్నారు. తమ కష్టాలన్నింటికీ ముగింపు పలుకుతాడని ఎన్నో కలలు కన్నారు. కానీ విధి మరోసారి వారిపై పగబట్టింది. విద్యుత్‌ ప్రమాదం రూపంలో ఉన్న ఒక్క ఆశనూ దూరం చేసింది. కడుపుకోతను మిగిల్చి, జీవితాంతం తీరని విషాదాన్ని వారి గుండెల్లో నింపింది.

ఎచ్చెర్ల, జూలై 19(ఆంధ్రజ్యోతి): కంటికి రెప్పలా చూసుకున్న ఇద్దరు పిల్లలూ నూరేళ్లు నిండకుండా తల్లిదండ్రుల కళ్లముందే వెళ్లిపో యారు. గతంలో కూతురు అనారోగ్యంతో కన్నుమూస్తే, ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు విద్యుదాఘాతానికి బలయ్యాడు. ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మం డలం పొన్నాడ పంచాయతీ గురువుపేట గ్రామానికి చెందిన గురువు ఎర్రయ్య, పార్వతి దంపతుల కుమారుడైన శ్యామ్‌కుమార్‌ (17) శ్రీకాకుళం నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని కలలు కన్న ఆ బాలుడిని మృత్యువు కబళించింది. ఆదివారం ఉద యం గ్రామంలోని ఓ ఫంక్షన్‌ నిమిత్తం ఫ్లెక్సీ కడుతుండగా ఒక్కసారిగా ప్రమాదం ముంచుకొ చ్చింది. విద్యుత్‌ స్తంభానికి పైన ఉన్న తీగలు ప్రమాదవశాత్తు తాకడంతో, శ్యామ్‌కుమార్‌ అక్క డికక్కడే కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన శ్రీకాకుళం సర్వజ నాసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్యామ్‌కుమార్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు న మోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. శ్యామ్‌కుమార్‌ మృతితో గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా 2013 సంవత్సరం ఆగస్టులో కూతురు కూడా రెండు, మూడేళ్ల వయసులో చనిపోయింది. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు దుఃఖసాగంలో మునిగిపోయారు.

Updated Date - Jul 20 , 2026 | 12:27 AM