Share News

‘కియోస్కో’లు పని చేయట్లే!

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:26 PM

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించాలన్న లక్ష్యం అటకెక్కు తోంది.

 ‘కియోస్కో’లు పని చేయట్లే!
బూర్జలో మూలకు చేరిన కియోస్క్‌ మిషన్‌

- నెట్‌వర్క్‌ లేక మూలకు చేరిన మిషన్లు

- రైతులకు అందని సాంకేతిక పరిజ్ఞానం

- కొరవడిన అధికారుల పర్యవేక్షణ

బూర్జ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించాలన్న లక్ష్యం అటకెక్కు తోంది. గ్రామ సచివాలయాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఎరువులు, విత్తనాలు తదితర సామగ్రి అందించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలుచేసిన కియోస్కో మిషన్లకు నెట్‌వర్క్‌ సహకరించడంలే దు. దీనికితోడు వ్యవసాయశాఖ అధికా రుల పర్యవేక్షణ లేకపోవడంతో నిరుప యోగంగా మారాయి. సచివాలయాల్లో దిష్టిబొమ్మలా మారాయి. బూర్జ మండ లంలోని 16సచివాలయాల్లో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు లకు సలహాలు, సూచనలు ఇవ్వ డంతోపాటు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందిం చేందుకు కియోస్కో యంత్రాలు ఏర్పాటుచేశారు. బహుళ ప్రయోజనాలు కల్పిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిన విష యం విదితమే. వ్యవసాయశాఖ ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు బుకింగ్‌ చేసుకోవడానికి కియోస్కోలు కూడా ఏర్పాటుచేశారు. అయితే నిర్వహణలోపం వల్ల అవన్నీ మూలకుచేరాయి. ప్రస్తుతం వీఏఏలు సెల్‌ఫోన్లు ఉపయోగించి వి వరాలు నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల యం త్రాల డిస్‌ప్లే పని వేయడం లేదు. నెట్‌వర్క్‌ అందకపోవడంతోపాటు ఆండ్రాయిడ్‌ బాక్సులు మొరాయించడంతో కియో స్కోలు వినియోగిం చడానికి వీలు పడడం లేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆర్బీకేల్లో ఏర్పాటుచేసిన కియో స్కోల వినియోగానికి వీలుగా అగ్రికల్చర్‌ అసి స్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. అయితే పలు చోట్ల కియోస్కోలకు టచ్‌ సమస్యతోపాటు సక్రమం గా విద్యుత్‌ సరఫరా లేకఅలంకారప్రాయంగా మిగిలాయి. కాగా ప్రస్తుతం వాటి పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని మం డల వ్యవసాయాధికారి ఉషారాణి తెలిపారు.

Updated Date - Feb 07 , 2026 | 11:26 PM