ముగిసిన కమ్మసిగడాం జాతర
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:57 PM
కమ్మసిగడాం మహాలక్ష్మి అమ్మవారి జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. చివరి రోజు గురువారం మన జిల్లాతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి సైతం భారీగా భక్తులు తరలిరావ డంతో ఆలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.
రణస్థలం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కమ్మసిగడాం మహాలక్ష్మి అమ్మవారి జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. చివరి రోజు గురువారం మన జిల్లాతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి సైతం భారీగా భక్తులు తరలిరావ డంతో ఆలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడే వంటలను తయారుచేసి సామూహిక భోజనాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూశారు. మరోవైపు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రణస్థలం-నెల్లిమర్ల రోడ్డులో భారీగా వాహనాలు బారులుదీరాయి. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను మళ్లిస్తూ.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు.