కంఠంలో దిగిన ఇనుప ఊచ
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:18 AM
ప్రమాదవశాత్తూ ఓ గ్రానైట్ కార్మికుడి కంఠంలో ఇనుప ఊచ దిగి మృతి చెందిన ఘటన మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
గ్రానైట్ కార్మికుడు మృతి
మెళియాపుట్టి, ఏప్రిల్ 24(ఆం ధ్రజ్యోతి): ప్రమాదవశాత్తూ ఓ గ్రానైట్ కార్మికుడి కంఠంలో ఇనుప ఊచ దిగి మృతి చెందిన ఘటన మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. రాజస్థాన్ రాష్ట్రం నాగర్‌పూర్ జిల్లాకు చెందిన ధర్మారామ్(34) గంగరాజుపురం పంచాయతీ పరిధిలో ఉన్న రాజీవ్ గ్రానైట్ కంపెనీలో కట్టర్‌గా కొన్నాళ్లగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గురువారం రాత్రి పనిచేస్తుండగా.. రాయి కటింగ్ చేసే యంత్రానికి సంబం ధించిన ఓ ఇనుప ఊచ అతడి కంఠంలో దిగబడింది. దీంతో తీవ్ర రక్త శ్రావంతో చికిత్స కోసం టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అమీర్ ఆలీ తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి
టెక్కలి రూరల్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మాకవరం బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ రాము తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. పలాస మండలం బహ్మణ తర్లా గ్రామానికి చెందిన కె.నీలాచలంతోపాటు టెక్కలి చెందిన వట్టుకుళ్ల రమేష్ ద్విచక్రవానంపై పలాస నుంచి టెక్కలి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వీరిలో నీలాచలం తలకు బలమైన గాయాలు కావడంతో చకిత్స నిమిత్తం శ్రీకాళకుం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
పెద్దకోట వీఆర్‌ఏ అప్పారావు..
ఎల్‌ఎన్ పేట, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): పెద్దకోట వీఆర్‌ఏగా పనిచేస్తున్న పి.అప్పారావు(65) శుక్రవారం మృతిచెందారు. అప్పారావు గత కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పారావుకు భార్య సోములమ్మ ఉంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, డెప్యూటీ తహసీలార్ నీలిమలతోపాటు కార్యాలయ సిబ్బంది, మాజీ సర్పంచ్‌లు ఎం.దివాకర్‌నాయుడు, జనార్దన్ చేరుకుని సంతాపం తెలిపారు.