Share News

గాయపడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:49 PM

అలికాం- బత్తిలి ప్రధాన రహదారిలో తురకపేట జంక్షన్‌కు సమీ పంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్‌.పాపారావు (55) చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు సరు బుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి

ఎల్‌ఎన్‌ పేట, మార్చి 6(ఆంధ్రజ్యోతి): అలికాం- బత్తిలి ప్రధాన రహదారిలో తురకపేట జంక్షన్‌కు సమీ పంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్‌.పాపారావు (55) చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు సరు బుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు. ఈ ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన పాపారావును చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పాపారావుకు భార్య శాంతమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 11:49 PM