‘వాల్మీకి మహర్షి ఆశయాలు స్ఫూర్తిదాయకం’
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:50 PM
వాల్మీకి మహర్షి జీవితం, ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రా యమని ఏఎస్పీ పి.శ్రీని వాసరావు అన్నారు.
శ్రీకాకుళం క్రైం, అక్టో బరు 26 (ఆంధ్రజ్యోతి): వాల్మీకి మహర్షి జీవితం, ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రా యమని ఏఎస్పీ పి.శ్రీని వాసరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఇతిహాసమైన రామాయణాన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందారన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘వాల్మీకి జీవితం ఆదర్శనీయం’
శ్రీకాకుళం కల్చరల్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వాల్మీకి జీవితం ఆదర్శనీయమని తెలుగు అధ్యాపకుడు భమిటిపాటి గౌరీశంకర్ అన్నారు. ఉపనిషన్మందిరం వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం ‘వాల్మీ కి రచన-వ్యక్తిత్వం’ అన్న అంశంపై ప్రసంగించారు. వాల్మీకి తన గురించి తాను ఎక్కడా వివరించుకోలేదన్నారు. వాల్మీకి చరిత్రపై పంజాబ్, హర్యానా విశ్వవిద్యాలయాలకు చెందిన ఇలపావులూరి పాండురంగారావు, ఆచార్య సహదేవి, జస్టిస్ బల్లా విస్తృత పరిశోధనలు చేసి అమూల్యమైన గ్రంథాలను రచించారన్నారు. వీటిని నేటి యువతకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. అనంతరం వక్తను మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్ సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కామేశ్వ రరావు, సభ్యులు పతంజలి శాస్త్రి, డా.మోహనరావు, డా.కోమలరావు తదితరులు పాల్గొన్నారు.