Share News

భారీ కొండచిలువ హల్‌చల్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:54 PM

12 Feets python పలాసలోని గౌతమ్‌వీధిలో శుక్రవారం అర్ధరాత్రి వేళ 12 అడుగుల పొడవు ఉండే భారీ కొండచిలువ(పైౖతాన్‌) హల్‌చల్‌ చేసింది. దీంతో స్థానికులు భయాందోళన చెంది కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈస్ట్రన్‌ఘాట్‌ వైడ్డ్‌లైఫ్‌ సొసైటీ సభ్యుడు, అటవీశాఖ నియమించిన స్నేక్‌క్యాచర్‌ ఓంకార్‌త్యాడి అక్కడకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు.

భారీ కొండచిలువ హల్‌చల్‌
కొండచిలువను పట్టుకున్న ఓంకార్‌త్యాడి

సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టిన స్నేక్‌క్యాచర్‌

పలాస, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): పలాసలోని గౌతమ్‌వీధిలో శుక్రవారం అర్ధరాత్రి వేళ 12 అడుగుల పొడవు ఉండే భారీ కొండచిలువ(పైౖతాన్‌) హల్‌చల్‌ చేసింది. దీంతో స్థానికులు భయాందోళన చెంది కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈస్ట్రన్‌ఘాట్‌ వైడ్డ్‌లైఫ్‌ సొసైటీ సభ్యుడు, అటవీశాఖ నియమించిన స్నేక్‌క్యాచర్‌ ఓంకార్‌త్యాడి అక్కడకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. శనివారం ఉదయం పలాస మండలం సమీపంలో ఉన్న అడవిలో సురక్షితంగా దానిని విడిచిపెట్టారు. కాగా ఓంకార్‌త్యాడి ఇప్పటికే ఉద్దానం ప్రాంతంలో సంచరించే రక్తపింజరి నుంచి కింగ్‌కోబ్రా వరకూ అనేక పాములు పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓంకార్‌త్యాడి విలేకరులతో మాట్లాడుతూ ‘సాధారణంగా పాములు ఎవరికీ హాని చేయవు. కొండచిలువలు అరుదైనవిగా గుర్తించాం. ఎవరికైనా తారసపడితే మాకు సమాచారం అందిస్తే పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెడతామ’ని తెలిపారు. ఆహారం కోసం అవి దాడి చేసే విధానాన్ని వివరించారు.

Updated Date - Jun 06 , 2026 | 11:54 PM