Share News

అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:18 AM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీని జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించిన నేపఽథ్యంలో సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష అధ్యక్షతన మున్సిపల్‌ నాయకులు, కార్యకర్తల అత్యవస సమావేశాన్ని నిర్వహించారు.

అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం
నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే శిరీషకు స్పష్టం చేసిన మున్సిపాలిటీ నాయకులు

పలాస, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీని జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించిన నేపఽథ్యంలో సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష అధ్యక్షతన మున్సిపల్‌ నాయకులు, కార్యకర్తల అత్యవస సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. అభ్యర్థులు ఎవరైనా విజయం కోసం శ్రమిస్తామని వారంతా స్పష్టం చేశారు. బీసీ జనరల్‌కు రిజర్వేషన్‌ వస్తుందని ఆశావాహులంతా అనుకున్నారు. జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించడంతో పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఎన్నికల్లో నేతలంతా ఖంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై ఎమ్మెల్యే శిరీష అత్యవసర సమావేశాన్ని నిర్వహించి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే తాము నడుచుకుంటామని, వ్యక్తిగత అభిప్రాయాలు ఏవీ లేవని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు తీసుకునే పనిలో నాయకులు పడ్డారు. అందరి అభిప్రాయం మేరకే చైర్మన్‌తో పాటు కౌన్సిలర్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో వజ్జ బాబూరావు, గాలి కృష్ణారావు, మల్లా శ్రీనివాస్‌, సప్ప నవీన్‌, కొరికాన శంకర్‌, డొక్కరి శంకర్‌, రామకృష్ణ, యవ్వారి మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:18 AM