గిన్నిస్ రికార్డు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:08 AM
గిన్నిస్ రికార్డు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. భోగాపురం విమానశ్రయం ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు 13 వేల మంది గిరిజన విద్యార్థినులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచదృష్టిని ఆకర్షించి, గిన్నిస్ వరల్డ్‌రికార్డులో చోటు సంపాదిం చడం ప్రతి తెలుగువారికి, గిరిజన సమాజానికి గర్వకారణమని తెలిపారు. గిన్నిస్ రికార్డు సాధించడంతో గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులు ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రికి సన్మానించారు.
కోటబొమ్మాళి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): గిన్నిస్ రికార్డు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. భోగాపురం విమానశ్రయం ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు 13 వేల మంది గిరిజన విద్యార్థినులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచదృష్టిని ఆకర్షించి, గిన్నిస్ వరల్డ్‌రికార్డులో చోటు సంపాదిం చడం ప్రతి తెలుగువారికి, గిరిజన సమాజానికి గర్వకారణమని తెలిపారు. గిన్నిస్ రికార్డు సాధించడంతో గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులు ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రికి సన్మానించారు. ఈ మేరకు గిరిజన విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషికి మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ థింసానృత్యాన్ని ప్రపంచవేదికపై నిలబెట్టి, గిరిజన సంస్కృతి వైభవా న్ని అంతర్జా తీయస్థాయిలో చాటిన ఘనతచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో తుం దన్నారు. గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల అంకితభావానికి మం త్రి అభినందించారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సి.జయరాం, నారా యణరావు, పి.తిరుపతిరావు, ఽధర్మారావు, ఎ. పద్మారావు, టి.కామేశ్వరరావు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం వై.సుజాతలు పాల్గొన్నారు.