Share News

దోషులను కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:59 PM

మహిళా ఎస్‌ఐ ప్రవల్లికకు తాము అండగా ఉంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి అప్పలరాజుతో ములాఖత్‌కు వచ్చిన సందర్భంగా ఆమదాలవలస వైసీపీ నాయకులు విధి నిర్వహణలో ఉన్న బూర్జ ఎస్‌ఐ ప్రవల్లికపై అనుచితంగా వ్యవహరించిన విషయం విదితమే.

 దోషులను కఠినంగా శిక్షించాలి
వినతిని స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష :

పలాస, జూలై 31(ఆంధ్రజ్యోతి): మహిళా ఎస్‌ఐ ప్రవల్లికకు తాము అండగా ఉంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి అప్పలరాజుతో ములాఖత్‌కు వచ్చిన సందర్భంగా ఆమదాలవలస వైసీపీ నాయకులు విధి నిర్వహణలో ఉన్న బూర్జ ఎస్‌ఐ ప్రవల్లికపై అనుచితంగా వ్యవహరించిన విషయం విదితమే. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే బుర్జలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ ప్రవల్లికను కలుసుకొన్నారు. శిరీష వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు ఉన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజాసమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పింఛన్లు, రేషన్‌ కార్డులు, గృహ నిర్మాణాలు, తాగునీరు, విద్యుత్‌, రహదారులు, భూవివాదాల సమస్యలు ఆమె దృష్టికి వినతులు తీసుకువచ్చారు.

Updated Date - Jul 31 , 2026 | 11:59 PM