Share News

జూలై 11న మహా సంగ్రామం

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:32 PM

అనంతపురంలో జూలై 11న మహా సంగ్రామం పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీ ఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు తెలిపారు. సీపీఎస్‌ ఉద్యో గులను ఎన్నాళ్లు మోసంచేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జూలై 11న మహా సంగ్రామం
కలెక్టరేట్‌ వద్ద సమావేశమైన ఏపీసీపీఎస్‌ఏఈ ఉద్యోగులు:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో జూలై 11న మహా సంగ్రామం పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీ ఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు తెలిపారు. సీపీఎస్‌ ఉద్యో గులను ఎన్నాళ్లు మోసంచేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గురు వారం ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు జి.భాస్కర్‌, జిల్లా ప్రధానకార్యదర్శి ఎ.షణ్ముఖరావు, మహిళా అధ్యక్షురాలు జయమ్మ, పైడి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:32 PM