ఘనంగా కూర్మనాథుని కల్యాణోత్సవం
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:17 AM
: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మంలో సోమవారం రాత్రి శ్రీకూర్మ నాథుని వార్షిక కల్యాణోత్సవం అత్యంత వైభ వంగా నిర్వహించారు.
వందలాదిగా తరలివచ్చిన భక్తులు
గార, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మంలో సోమవారం రాత్రి శ్రీకూర్మ నాథుని వార్షిక కల్యాణోత్సవం అత్యంత వైభ వంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఇక్కడ స్వామి వారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. తొలుత మేళ తాళాలు, గోవిందనామ స్మరణ, వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. గజ వాహనంపై గోవిందరాజస్వామిని, హంస వాహనంపై శ్రీదేవి, భూదేవి, సీతమ్మ విగ్రహా లను, అశ్వ వాహనంపై లక్ష్మణస్వామి, చక్ర వాహనంపై శ్రీరామచంద్రమూర్తిని, చిన్న పల్లకి లో చక్ర నారాయణస్వామిని వేంచేపు చేసి గ్రామంలో తిరువీధి నిర్వహించారు. కల్యాణో త్సవంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు చామర్ల సీతారామ నరసింహాచార్యులు ఆధ్వ ర్యంలో ఎదుర్కోలు ఉత్సవం, కల్యాణం నిర్వహించారు. దేవస్థానం ఈవో టి.వాసుదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.