Share News

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థం

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:49 PM

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామికి గురువారం వంశధార నదిలో ఘనంగా చక్రతీర్థ స్నానాలు అర్చకులు నిర్వహించారు.

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థం
నదిలో స్వామివారికి మంగళ స్నానాలు చేయిస్తున్న అర్చకులు, దేవదాయశాఖ అధికారులు

జలుమూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామికి గురువారం వంశధార నదిలో ఘనంగా చక్రతీర్థ స్నానాలు అర్చకులు నిర్వహించారు. శ్రీకూర్మనాథస్వామి డోలోత్సవాలు పురస్కరించుకొని శ్రీముఖలింగంలో గల పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తు లకు వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి నదిలోకి తీసుకెళ్లారు. నది ఒడ్డున పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారి తిరిగి పల్లకిలో ఆలయానికి తీసుకువ చ్చి యథాస్థానానికి చేర్చారు. ఆలయ ఈవో ఏడుకొండలు, పాలకమండలి చైర్మన్‌ శివప్రసాద్‌ పాడి, అర్చకులు నారాయణమూర్తి, ఎస్‌వీ చలం, శ్రీకష్ణ, శివ, అచ్యుత, అప్పారావు, ఎంపీటీసీ కె.హరిప్రసాద్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:49 PM