Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:52 PM

రైతు సంక్షేమం, వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వేల్పురాయి గ్రామంలో శుక్రవారం ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి అచ్చెన్నాయుడు

వేల్పురాయి గ్రామంలో రైతన్నా మీకోసం..

రణస్థలం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమం, వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వేల్పురాయి గ్రామంలో శుక్రవారం ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ ఉపసంచాలకుడు శ్రీనివాసరావు మంత్రికి వివరించారు. రణస్థలం మండలంలోని 46 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యల్పంగా భూగర్భ జలా లు ఉన్న మండలాల్లో రణస్థలం ఒక టని, వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు పడని తీవ్ర పరిస్థితి ఇక్కడ నెలకొందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని రణస్థలం మం డలానికి తీసుకువచ్చే బాధ్యతను ప్రభు త్వం స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల పాలన లో గొడ్డలి పార్టీ విధ్వంసాలు సృష్టిం చిందని, రాష్ట్రాని అప్పులపాల్జేశారని, దీంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నేడు ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. భూగర్భ జలాలు తక్కు వగా ఉన్నందన ఉద్యానవన, పశుసం వర్థక, మత్స్య శాఖ ల సహకారంతో 9 రకాల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్లను రైతులకు తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నట్లు వెల ్లడించారు. పంటల బీమా గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉందన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులు స్వయంగా బీమా నమోదు చేసుకోవాలని సూ చించారు. వారం రోజుల పాటు అధికారులు గ్రామాల్లో ఉండి రైతులను అప్రమత్తం చేస్తారన్నారు.

తోటపల్లి నీటిని అందించాలి: ఎన్‌ఈఆర్‌

ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ.. మొక్క జొన్న రైతులు నీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతు న్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మడ్డువలస కాలువ నీటిని బుడుమూరు చెరువుకు మళ్లిం చి పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి కొరత తీర్చాలని కోరారు. 50 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న తోటపల్లి ప్రధాన, పిల్ల కాలువలను బాగు చేసి నీరు అందిస్తే రణస్థలం, లావేరు మండలాలు సశ్యశ్యామలం అవుతాయన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి నుంచి ప్రత్యామ్నాయ పంట ల వైపు దృష్టి సారించాలన్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. వాతావరణం మార్పులను తట్టు కుని రైతులకు నిలకడైన రాబడి అందించేందుకు నవధా న్యాలను సాగు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రధాన మంత్రి పసల్‌ బీమా యోజన కింద పేర్లు నమోదు చేసుకో వాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చౌదరి బాబ్జి, ముప్పిడి సురేష్‌, లంక శ్యామలరావు, డీజీఎం ఆనంద రావు, నడుకుదిటి తేజబాబు, బాలి శ్రీను, పలు శాఖల అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:52 PM