Share News

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:07 AM

ప్రజల స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుదని, స్వచ్ఛ సంకల్పమే ప్రభుత్వ ధ్యేయమ ని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
స్వచ్ఛరథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

హరిపురం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రజల స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుదని, స్వచ్ఛ సంకల్పమే ప్రభుత్వ ధ్యేయమ ని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలం మందస, బుడార్సింగి, హరిపురం గ్రామాల స్వచ్ఛ రథాలను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, ఎంపీడీవో వెంకటరమణ, ఏపీఎం కూర్మారావు, టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన, పీఏసీఎస్‌ చైర్మన్‌ తమిరి భాస్కరరావు, నాయకులు సాలిన మాధవరావు, రట్టి లింగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 12:07 AM