Share News

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:08 PM

ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

 గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

- ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. బుధవారం కొళిగాంలోని శ్రీఅమ్మఘాగడశుణి దేవాలయం సీసీ రోడ్డు పనులను భూమి పూజ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ఆలయ రోడ్డు నిర్మాణంలో గత వైసీపీ ప్రభు త్వం నిర్లక్ష్యం చేసిందని, దీంతో భక్తులు ఇబ్బందులు పడేవారని తెలిపారు. భక్తుల ఇబ్బందులను గుర్తించి 1300మీటర్లు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనికోసం ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు రూ.40లక్షలు కేటాయిం చామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరిరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం, నాయకులు పెదిని బాబ్జీ, మెరుగు సూర్యనారాయణ, సాడి సహదేవ్‌రెడ్డి, దక్కత ఢిల్లీరావు, గిన్ని బాలరాజు, డి.ప్రకాష్‌చంద్రనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:08 PM