Share News

రైతులు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:13 AM

రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

రైతులు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

  • ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం కొత్తపోలవలసలో రాజముద్రతో జారీ చేసిన పాస్‌పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూఆర్‌ కోడ్‌, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారులు పాస్‌ పుస్తకాలు రైతులు అందించడం సంతోషంగా ఉందన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలపై అప్పటి సీఎం జగన్‌ ఫొటోను చూసిన రైతులు నిద్రలేని రాత్రులు గడపారని, భూ సరిహదెంద రాళ్ల పై కూడా ఫొటోలు ఉండటం చూసి రైతులు ఆవేదన చెందారన్నారు. మనభూమిపై పులివెందుల పంచాయతీ ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం చూపిందన్నారు. లిటికేషన్‌ భూములు క్రమబద్ధీకరణ,భూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, పొందరి, కురాకుల సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదరం నర్సింహాలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇసా అప్పారావు, సర్పంచ్‌ పట్ట ప్రభాకర్‌, టీడీపీ నాయకులు అడపా చంద్రశేఖర్‌, పూతి రమణ, రావాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:13 AM