Share News

రైతు శ్రేయస్సే ప్రభుత్వం ధ్యేయం

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:49 PM

రైతు శ్రేయస్సే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్మేలు తెలిపారు. సోమ వారం జిల్లాలో భూసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీచేశారు.

రైతు శ్రేయస్సే ప్రభుత్వం ధ్యేయం
నరసన్నపేట: దేవాదిలో పాస్‌పుస్తకాన్ని రైతుకు అందజేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి :

రైతు శ్రేయస్సే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్మేలు తెలిపారు. సోమ వారం జిల్లాలో భూసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీచేశారు.

ఫహరిపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా తమ పాలన సాగుతోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలి పారు. మందస మండలంలోని దున్నూరు గ్రామసభలో రైతులకు ప ట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రైతులను ఆదుకొనేందుకు పాస్‌పుస్తకాలపై రాజముద్ర వేసి ఉచితంగా పాస్‌ పుస్తకాలు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. పుస్తకాల్లో తప్పులు ఉంటే ఫిర్యాదు చేసి సరిదిద్దుకో వాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యోఽ దన లబ్బ రుద్రయ్య, దాసరి తాతారావు, సాలిన మాధవరావు, వాసు, డీటీ రామకృష్ణ పాల్గొన్నారు.

ఫ నరసన్నపేట, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల కళ్లల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మండలంలోని దేవాదిలో నిర్వహించిన రెవెన్యూసదస్సులో రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దుచేసినట్లు గుర్తుచేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాలపై అప్పటి సీఎం జగన్‌ ఫోటోను చూసిన రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని తెలిపారు. కార్యక్రమంలో నియోజవర్గ ఇన్‌చార్జి బగ్గు అర్చన, పొందర కురాకుల చైర్మన్‌ దామోదరం నర్సింహులు, మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్‌ పోగోటి ఉమామహేశ్వరి, టీడీపీ మండలాధ్యక్షులు అడపా చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ ఆర్‌. సత్యనారాయణ, డీటీ శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, వేణుగోపాలరావు పాల్గొన్నారు.

ఫహిరమండలం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేతో రైతులు, భూయజమానులు తీవ్ర ఇబ్బందులుపడ్డారని పాతపట్నం ఎమ్మెల్యే మామిగి గోవిందరావు తెలిపారు. మండలంలోని ఎం.ఎల్‌.పురంలో పట్టాదారు పాసుపు స్తకాలను రైతులకు పంపిణీ చేశారు.అలాగే వికసిత భారత్‌-రోజ్‌ గార్‌,ఆజీవికా మిషన్‌ చట్టంపై గ్రామసభలో అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత రీసర్వే సమస్యలను పరిష్కరించి ,అండగా నిలుసోం దని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు గోళ్ళ సింహాచలం నాయకులు టి.తిరుపతిరా వు, శ్రీనివాసరావు, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 11:49 PM