Share News

రైతుల మేలు కోరేది ప్రభుత్వం

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:21 AM

రాష్ట్రంలో రైతుల మేలు కోసం కూట మి ప్రభుత్వం పాటుపడుతోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

రైతుల మేలు కోరేది ప్రభుత్వం
రైతులకు కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల మేలు కోసం కూట మి ప్రభుత్వం పాటుపడుతోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. ప్రగడపుట్టుగ, బొరివంక గ్రామంలో మంగళ వారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయా ప్రాం తాలకు అనుగుణమైన పంటలు సాగుచేసేందుకు చర్యలు తీసుకుం టోందన్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు సాగు చేసు కోవాలని, దీనివల్ల భూసారం పెరగడంతో పాటు పంటలు ఆరోగ్యంగా ఉంటా యన్నారు. కార్యక్రమంలో జేడీఏ త్రినాఽథస్వామి, ఏడీఏ టి.భవానీ శంకర్‌, ఏవో పి.శ్రీదేవి, రైతులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

ఇచ్ఛాఫురం. మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రత్తకన్న గ్రామానికి చెందిన గొర్రెల సోమేష్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయన కుటుంబానికి ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ రూ.1.27 లక్షలను మంజూరు చేసింది. ఈ చెక్కును మంగళవారం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మృతుడి భార్య త్రివేణికి అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, పార్టీ నేతలు లంక ప్రకాష్‌, బుగత జగన్‌, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:21 AM