Share News

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:11 PM

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

 దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

-ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాసరూరల్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కేదారిపురం గ్రామంలో మంగళవారం దివ్యాంగులకు వీల్‌చైర్లు, వినికిడి పరికరాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకోలేదన్నారు. కేంద్ర విమానయానశాఖామంత్రి కింజరాపు రా మ్మోహన్‌నాయుడు కృషి మేరకు రూ.74లక్షలతో 350మందికి వీల్‌చైర్లు, వినికిడి పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారి వివరాలు సేకరించి పరికరాలను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీడీవో, జిల్లా విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్డేపల్లి శైలజ, ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరికట్ల విఠల్‌రావు, ఎంపీడీవో వసంత్‌కుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు, పలాస పీఏసీఎస్‌ చైర్మన్‌ వంకల కూర్మారావు, దువ్వాడ సంతోష్‌కుమార్‌, యాదగిరి పాల్గొన్నారు.

- కేదారిపురంలో నూతనంగా నిర్మించిన విలేజ్‌ క్లినిక్‌, రైతుసేవా కేంద్రం, సచివాలయ నూతన భవనాలను ఎమ్మెల్యే శిరీష మంగళవా రం ప్రారంభించారు.

- ఎన్నికల ముందు ప్రజ లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు ఎమ్మె ల్యే గౌతు శిరీష అన్నారు. అమలకుడియా గ్రా మంలో మంగళవారం రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. గత వైసీపీ అహంకారపూరిత పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించాలన్నారు. ప్రతీ రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకా లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ ఎం.శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:11 PM