మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:50 PM
మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
అరసవల్లి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని జడ్పీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఇఫ్తార్ విం దు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జామియా మసీదు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముస్లిం మైనారిటీలకు ప్రతీ ఏటా బడ్జెట్ కేటాయిస్తున్నామని, గౌరవ వేతనాలు అందిస్తున్నామని, విద్య, వైద్య సదు పాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభా కాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రభు త్వం మైనార్టీల ప్రభుత్వమని, వారి అభివృద్ధికి చేయూత అందిస్తుం దన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, డీఆర్వో లక్ష్మణ మూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, మైనార్టీ సంక్షేమాధికారి మహబూబ్ షరీఫ్, ముస్లిం మత పెద్దలు ఎస్‌కే నిజాత్, బహదూర్ బాషా, మహ్మ ద్ యాసిన్, హాజి అమిరుల్లా బేగ్, ముస్లిం సోదరులు, కూటమి నేతలు పాల్గొన్నారు.