ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా పని చేయాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:39 PM
సామాజిక బాధ్యతతో ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యం గా పనిచేయాలని డీఎస్పీ సీహెచ్ వివేకానంద కోరారు.
అరసవల్లి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): సామాజిక బాధ్యతతో ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యం గా పనిచేయాలని డీఎస్పీ సీహెచ్ వివేకానంద కోరారు. 37వ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం ఆర్టీసీ కాంప్లె క్స్ ఒకటో డిపో ఆవరణలో శుక్రవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రమాదం సంభవించినప్పుడు సిబ్బంది మానవతా దృక్ప థంతో గాయపడ్డ ప్రయాణి కులకు సేవలందిం చాలన్నారు. ప్రమాదం జరి గిన వెంటనే 1033 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఆర్టీవో గంగాధర్ మాట్లాడు తూ ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు ప్రమా దం జరిగిన వెంటనే ఆర్టీసీ అధికారులకు తెలపాలని, వారి తప్పు ఉన్నా, లేకపోయినా వెంటనే పోలీసులకు ఫిర్యా దు చేయాలన్నారు. డీటీసీ విజయసారథి మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్‌ను వినియో గించరాదన్నారు. అనంతరం 30 ఏళ్ల నుంచి ఎటువంటి ప్రమా దాలు జరగకుండా జాగ్ర త్తలు తీసుకున్న డ్రైవర్లకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలను అంద జేశారు. అలాగే వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, సత్యనారాయణ, రాజు, డిపో మేనేజర్లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.