Share News

మహిళాభ్యున్నతే ధ్యేయం

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:23 AM

We will make everyone an entrepreneur మహిళాభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యే యం. ప్రతీ మహిళను పారిశ్రామిక వేత్తగా తయారుచేయడమే లక్ష్యమ’ని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు.

మహిళాభ్యున్నతే ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న మత్రి అచ్చెన్నాయుడు

ప్రతి ఒక్కరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం

మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి రూరల్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళాభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యే యం. ప్రతీ మహిళను పారిశ్రామిక వేత్తగా తయారుచేయడమే లక్ష్యమ’ని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం టెక్కలిలో అంతర్జాతీయ మహిళా దినోత్స వం పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్వయంశక్తి సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సమా జ అభివృద్ధిలో మహిళలు కీలకం. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సమానత్వం, సాధికారత, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. స్ర్తీ శక్తి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిం చాం. త్వరలో 18 లక్షల మందికి ఇళ్లు మం జూరు చేయనున్నాం. వ్యక్తిగత రుణాలు రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాలని బ్యాంకులకు సూచించాం. మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపి.. సమాజానికి ఆదర్శంగా నిలవాల’ని తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రుణాలకు సంబం ధించి రూ.328 కోట్ల చెక్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎం సీ చైర్మన్‌ బగాది శేషగిరి, పినకాన అజయ్‌ కుమార్‌, కింజరాపు ప్రసాద్‌, ఎంపీడీవో రేణుకాదేవి, డీఎల్‌డీవో అలివేలు మంగమ్మ, తహసీల్దార్‌ సత్యం, ఏపీఎం ఉమారాణి, మెండ దమయంతి, హనుమంతు రామ కృష్ణ, సుందరమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 12:23 AM