ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:51 PM
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూట మి ఘనవిజయమే ప్రధాన లక్ష్యంగా నాయ కులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయా లని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
విభేదాలు వీడి విస్తృత ప్రచారం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూట మి ఘనవిజయమే ప్రధాన లక్ష్యంగా నాయ కులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయా లని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కార్పొరేటర్లతో పాటు మేయర్ అభ్యర్థి గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. నగరం లోని తన స్వగృహంలోని శనివారం రాత్రి ఎన్నికల సన్నాహక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావు లేకుండా ఐక్యంగా ముందుకు సాగి అభ్యర్థులను గెలిపించాలని ఆకాంక్షిం చారు. సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జడ్పీచైర్‌పర్సన్ కొరికాన భవాని తదితరులు పాల్గొన్నారు.