స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:21 PM
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ముద్దాడ గ్రామంలో శని వారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభి వృద్ధి, సంక్షేమ పథకాలకు సమ ప్రాధా న్యం ఇస్తున్నట్టు చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శతశాతం ఫలితాలు సాధించేలా కూటమి నేతలు, కార్యకర్తలు సమన్వ యంతో పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టా లని కోరారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, అక్కడికక్కడే వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం నియోజక వర్గానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, పార్టీ నేతలు వావిలపల్లి రామకృష్ణ, పంచిరెడ్డి కృష్ణారావు, మాడుగుల వీరభద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.