Share News

సహకార బ్యాంకుల బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:11 AM

: సహకార రంగాన్ని బలోపేతం చేసి, బ్యాంకులను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆలిండి యా కోపరేటివ్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ కేవీఎస్‌ రవి కుమార్‌ తెలిపారు. డీసీసీబీ 61వ వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు.

సహకార బ్యాంకుల బలోపేతమే లక్ష్యం
బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న డీసీసీబీ చైర్మన్‌ సూర్యనారాయణ, ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ రవికుమార్‌

ఆలిండియా కో ఆపరేటివ్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ రవికుమార్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సైకిల్‌ యాత్ర

అరసవల్లి, ఏప్రిల్‌ 13(ఆంధ్ర జ్యోతి): సహకార రంగాన్ని బలోపేతం చేసి, బ్యాంకులను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆలిండి యా కోపరేటివ్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ కేవీఎస్‌ రవి కుమార్‌ తెలిపారు. డీసీసీబీ 61వ వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి బైక్‌ ర్యాలీని ప్రా రంభించామన్నారు. 16 మంది ఉద్యోగులు ఈనె ల 13 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1300 కిలోమీటర్లు ప్రయాణించి, ప్రజలకు, రైతులకు సహకార బ్యాంకుల ప్రాముఖ్యతను వివరిస్తార న్నారు. దేశంలోనే పంచాయతీరాజ్‌ వ్యవస్థ తరు వాత సహకార రంగం రెండవ అతి పెద్ద వ్యవస్థ అని, ఇది పూర్తిగా నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీబీ చైౖర్మన్‌ శివాల సూర్య నారాయణ మాట్లాడుతూ.. డీసీసీబీ బలో పేతానికి రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందరూ సమష్టిగా పనిచేసి ఈ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఉద్యో గులకు బీమా సదుపాయం కల్పించిన రెండో జిల్లా శ్రీకా కుళం అని అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగుల కోఆర్డినేషన్‌ కమిటీ చైౖర్మన్‌ శ్రీనివా సులు, ఎస్‌వీ ఎస్‌ జగదీష్‌, మురళి, కామరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:11 AM