ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - May 30 , 2026 | 11:37 PM
ప్రజా సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా చర్యలు తీసు కుంటున్నామని విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం నడిమి వలసలో ప్రజాదర్బార్ నిర్వహిం చారు.
జి.సిగడాం, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా చర్యలు తీసు కుంటున్నామని విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం నడిమి వలసలో ప్రజాదర్బార్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అభి వృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వంలో అప్పులాంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నార న్నారు. గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బం దులు పడుతున్నామని పలువురు మహిళలు వివరించారు. గతంలో తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికి నేటికీ అధికారులు స్పందిం చలేదని వారు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా స్పం దించిన ఆయన ఆర్‌డబ్య్లూఎస్ డీఈతో ఫోన్‌లో మాట్లాడి జూలై 10 తేదీ నాటికి గ్రామంలో తాగు నీరందించాలని ఆదేశించారు. ఈ పది రోజులు ట్యాంకుల ద్వారా తాగు నీటిని అందిస్తామన్నారు.
రానున్న స్దానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతీ ఒక్కరు పనిచేయాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం నడిమివలసలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వ హించారు. కూటమి నాయకులను కలుపుకుని అభ్యర్థుల గెలుపు దిశగా కృషి చేయాలన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్య క్రమంలో టీడీపీ మండల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.