ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:39 PM
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యమని కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
టీడీపీ జిల్లా కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’
శ్రీకాకుళం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యమని కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ కష్టాలను ఏకరువు పెట్టేం దుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తులు ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు ఆయన నేరుగా వెళ్లి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి నుంచి అర్జీలను స్వీకరించారు. కేవలం వినతులు తీసుకోవడానికే పరిమితం కాకుండా, పలు సమస్యలపై తక్షణమే స్పందించారు. అత్యవసరమైన, వెంటనే పరిష్కరించగలిగే అర్జీ లను పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కార మార్గాలు చూపించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.