Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం: శంకర్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:40 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం: శంకర్‌
ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్ర వారం స్థానిక విశాఖ-ఎ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తాగునీరు, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, భూ సమస్యలపై వినతులిస్తున్నా రని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. నాయకులు, కార్యకర్తల తో మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఆరోగ్య విస్తరణాధికారులు, కమ్యూనిటీ ఆరోగ్య అధికారుల సంఘం-2026 డైరీని శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆవిష్కరించారు. కార్యక్ర మంలో ఆ సంఘం నేతలు తుమ్మిడి సోమేశ్వరరావు, కేవీ నారాయణ రావు, ఆర్‌.వెంకటరావు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:40 PM