Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:54 PM

: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో పెద్ద లోగిడి, భగదళ, గురండి, సింగుపురం, గంగువాడ, బడ్డుమర్రి, చిన్నమల్లిపురం, పెద్ద మల్లిపురం గ్రామ పంచాయతీల టీడీపీ నేతలతో కాఫీ విత్‌ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని గురువారం నిర్వ హించారు. గ్రామాల వారీగా నేతలతో మాట్లాడుతూ గ్రామాలలో తాగు, సాగునీరు, రహదారులు, మౌలిక సౌకర్యాలపై చర్చించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోవిందరావు:

పాతపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో పెద్ద లోగిడి, భగదళ, గురండి, సింగుపురం, గంగువాడ, బడ్డుమర్రి, చిన్నమల్లిపురం, పెద్ద మల్లిపురం గ్రామ పంచాయతీల టీడీపీ నేతలతో కాఫీ విత్‌ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని గురువారం నిర్వ హించారు. గ్రామాల వారీగా నేతలతో మాట్లాడుతూ గ్రామాలలో తాగు, సాగునీరు, రహదారులు, మౌలిక సౌకర్యాలపై చర్చించారు. ఇంతవరకూ చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతుల, కార్యకర్తలు పాల్గొన్నారు.

దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం

విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుతో రైతుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. రూ.54లక్షల వ్యయంతో తామర గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను, లైన్లను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నిటినీ ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:54 PM