Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:10 AM

ప్రజా సమస్యల పరిష్కారమే కాఫీ విత్‌ ఎమ్మెల్యే కార్యక్రమం లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
నేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోవిందరావు :

పాతపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే కాఫీ విత్‌ ఎమ్మెల్యే కార్యక్రమం లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో రొమదళ, రొంపివలస, కొరసవాడ, కాగువాడ, సీతారాంపల్లి, బూరగాం, బోరుభద్ర పంచాయతీలు, మెళియాపుట్టి మండల పరిధిలోని పట్టుపురం, జోడూరు, మారేడుకోట పార్టీ నాయకులు, కార్యకర్తలతో కాఫీ విత్‌ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పరిష్కార చర్యలపై ౖసూచనలు, సలహాలివ్వాలన్నారు. అప్పటి కప్పుడే పరిష్కార సాధ్యమయ్యే అంశాలపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అనం తరం నాయకులతో ముఖాముఖి మాట్లాడుతూ నేతల మధ్య విభేదాలకు తావివ్వకూడదని అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు.

Updated Date - Sep 16 , 2026 | 12:10 AM