Share News

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:31 PM

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయ మని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నా రు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయ మని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నా రు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంల ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా నియో జకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సమస్యలపై వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధి కారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్ర మంలో డీసీ సీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, మున్సి పల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా సాగర్‌, నాయకులు నూకరాజు, సంపదరావు మురళి, నాగళ్ల మురళీ ధర్‌యాదవ్‌, గొండు రమణ, రెడ్డి రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:31 PM