Share News

తీరం భద్రతపై అవగాహనే లక్ష్యం

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:57 PM

తీరప్రాంత పరిరక్షణ, భద్రతపై సీఐ ఎస్‌ఎఫ్‌ బృందం అవగాహనే లక్ష్యంగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తోందని, ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను గుర్తించిందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. వందేమాతరం గీతం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ బృందం దేశవ్యాప్తంగా చేపట్టిన కోస్టల్‌ సైక్లోథాన్‌ యాత్ర గురువారం రాత్రి అరసవల్లికి చేరుకుంది.

తీరం భద్రతపై అవగాహనే లక్ష్యం
సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను అభినందిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ :

అరసవల్లి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తీరప్రాంత పరిరక్షణ, భద్రతపై సీఐ ఎస్‌ఎఫ్‌ బృందం అవగాహనే లక్ష్యంగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తోందని, ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను గుర్తించిందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. వందేమాతరం గీతం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ బృందం దేశవ్యాప్తంగా చేపట్టిన కోస్టల్‌ సైక్లోథాన్‌ యాత్ర గురువారం రాత్రి అరసవల్లికి చేరుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం యాత్రను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సైకిల్‌ యాత్రికులకు హారతులిచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిల్చొని వారిపై పూలుజల్లి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3,500 కిలోమీటర్లు యాత్ర నిర్వహిస్తున్నారని, జిల్లాలో తొలుత బారువ బీచ్‌, అనంతరం కళింగపట్నం చేరుకున్నారన్నారు. జిల్లాలో గల 193 కిలోమీటర్ల తీరప్రాంత అభివృద్ధి, రక్షణకు సంబంధించి వారు సూచనలు, సలహాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 65 మంది సీఐఎస్‌ఎఫ్‌ బృంద సభ్యులు పాల్గొంటున్నారని, జిల్లాలో వారికి లభించిన అతిథ్యం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఫ రణస్థలం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌ యాత్ర శుక్రవారం రణస్థలం చేరుకుంది. వారికి జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌. చిరంజీవి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సౌత్‌జోన్‌ డీఐజీ ఎంజీ రాజేంద్రకుమార్‌ పర్యవేక్షణలోఈ సైకిల్‌ ర్యాలీ సాగుతోంది. కోష్ట ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కొద్దిసేపు వారు ముచ్చటించారు.

Updated Date - Feb 06 , 2026 | 11:57 PM