Share News

పేదలకు పథకాలు అందించడమే ధ్యేయం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:12 AM

పేదలకు పథకాలు అందించడమే ప్రభుత్వం ధ్యేయమని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. శనివారం జిల్లాలో పలుచోట్ల నిర్వ హించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమంపై అవగాహన కల్పించారు.

పేదలకు పథకాలు అందించడమే ధ్యేయం
పలాస: పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పేదలకు పథకాలు అందించడమే ప్రభుత్వం ధ్యేయమని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. శనివారం జిల్లాలో పలుచోట్ల నిర్వ హించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమంపై అవగాహన కల్పించారు.

ఫ పలాస, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మండలంలోని సున్నాడలో ఇంటింటికి తెలుగుదేశం కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వసంక్షేమ పథకాల గురించి అడిగితెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు.

ఫనందిగాం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉయ్యాలపేట, నర్శిపురం గ్రామాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షులు పినకానజోగారావు ఆధ్వర్యంలో గ్రామాల్లో కూటమి ప్రభు త్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు పినకాన అజయ్‌కుమార్‌, డి.సింహాచలం, పి.శ్రీనివాస్‌, అప్పారావు, ఎస్‌.దామోదరరావు, జి.ప్రకాష్‌ పాల్గొన్నారు.

ఫపలాస రూరల్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డపాడులో కూటమి ప్రభుత్వ సంక్షేమం పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. కార్యక్ర మంలో తెలుగుయువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బొడ్డు దుష్యం త్‌, కోకన్వీనరు తామాడ ధర్మారావు, సింహాద్రి, బత్తిన నీలవేణి పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:12 AM