సురక్షితమైన నీరందించడమే ధ్యేయం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:08 AM
: ప్రతి ఇంటికి సురక్షితమైన తాగు నీరందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గౌతుశిరీష తెలిపారు.
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికి సురక్షితమైన తాగు నీరందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గౌతుశిరీష తెలిపారు. గురువారం మండలంలోని సైనూరులో జల్‌జీవన్ మిషన్ పథకం కింద వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో భాగంగా పాసుపుస్తకాలను రైతులకు అందజేశారు. ఈసందర్భంగా శిరీష మాట్లాడుతూ రైతులకు చెందిన భూములపై వారికే పూర్తి స్థాయి హక్కు ఉండాలనే ఉద్దేశ్యంతో రాజముద్రతో పాసుపుస్తకాలు అందజేస్తున్నా మని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు విఠల్, పుచ్చ ఈశ్వరరావు, సైన యోగి, కర్ని రమణ, గోవిందపాపారావు పాల్గొన్నారు.